28న ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలి : MLC మేరిగ మురళీధర్
Gudur, Tirupati | Oct 24, 2025 ఈ నెల 28న గూడూరు పట్టణంలో నిర్వహించనున్న ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ మేరీగ మురళీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం గూడూరు సనత్ నగర్లో వైసీపీ నాయకులతో కలిసి ర్యాలీ గోడ పత్రికలను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పేద విద్యార్ధులకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. 10 మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేయడం దారుణమన్నారు. ఈ ప్రజా ఉద్యమంలో పార్టీలకతీతంగా పాల్గొనాలని కోరారు.