కోడుమూరు: నిడ్జూరులో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని నిడ్జూరు గ్రామంలో సోమవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంట లాభాలు పెంచే విధానాలు, ఆధునిక సేద్యం, సబ్సిడీల వివరాలు, భవిష్యత్తు వ్యవసాయ విధానాలు వంటి అంశాలపై రైతులకు ఎమ్మెల్యే వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంట నష్టం, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ సాయంపై చర్చించారు. కూటమి ప్రభుత్వం రైతన్న సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తుందని తెలిపారు.