యర్రగొండపాలెం: దోర్నాలలో త్వరలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని తెలిపిన టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
ప్రకాశం జిల్లా దోర్నాల మండల కేంద్రంలో త్వరలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఎరిషన్ బాబు తెలిపారు. వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా సీఎం చంద్రబాబుకు దోర్నాలలో రెండవ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కోరుకున్నట్లు తెలిపారు. త్వరలో శంకుస్థాపన చేస్తానని పేర్కొన్నారు.