సర్వేపల్లి: నాగుల చవితి రోజు మనుబోలులో అద్భుతం, ఒకేసారి రెండు నాగుపాములు భక్తులకు దర్శనం
మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో అద్భుతం జరిగింది.. ఆలయంలోనికి శనివారం తెల్లవారు జామున రెండు నాగుపాములు ఒక్కసారిగా విశ్వనాథ స్వామి సన్నిధానంలోకి వచ్చి పడగ విప్పి భక్తులందరికీ దర్శనమిచ్చాయి. అందులో ఒక నాగుపాము శ్వేతనాగుగా అని భక్తులు భావిస్తున్నారు. నాగుల చవితి పర్వదినాన రెండు నాగు పాములు దర్శనమివ్వడం పై మనుబోలులో చర్చ జరుగుతుంది.