ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని అనంతపురం డిప్యూటీ మేయర్ దాసరి వసంతి సాహిత్య, 13వ డివిజన్ పార్టీ మంగళవారం 12 గంటల సమయంలో ఇన్‌చార్జ్ బండి శ్రీకాంత్ మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజ, నీలం థియేటర్ సమీపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్థానిక ప్రజలను కలుసుకొని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.