నిడుమోలులో రోడ్డుప్రమాదం... వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి
Machilipatnam South, Krishna | Sep 17, 2025
మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై నిడుమోలు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెడన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కమాల్ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. విజయవాడ వైపు బైక్ పై వెళ్తున్న అతన్ని రాంగ్ రూట్లో వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.