రాష్ట్ర స్థాయి అండర్-19 నెట్ బాల్ పోటీలకు కొత్త మంచూరు విద్యార్థులు ఎంపిక
అన్నమయ్య జిల్లా సి.టి.యం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి అండర్-19 క్రీడా పోటీలు జరిగాయి. ఈ క్రీడా పోటీల్లో బాలికల విభాగంలో వాల్మీకిపురం మండలం కొత్త మంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అపర్ణ, అలేఖ్య, గాయత్రి లు మంచి ప్రతిభ కనబరిచి ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్-19 నెట్ బాల్ టీమ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు వి.ప్రకాష్, పి.డి రెడ్డి వరప్రసాద్ మరియు పాఠశాల ఉపాద్యాయ బృందం శుక్రవారం అభినందించారు.