జగిత్యాల: నూకపల్లి సరస్వతి ఆలయానికి వెళ్లి, అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
-ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్వాగతం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 8-30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మల్యాల మండలం నూకపల్లి సరస్వతి ఆలయానికి వెళ్లి, అమ్మవారిని దర్శించుకునీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ స్వాగతం పలికారు.సరస్వతీ మాత ఆలయం తో పాటుగా నూకపల్లి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం తదితర అంశాలపై ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు వివరించారు.