వనపర్తి: క్రైస్తవులు సమాజాభివృద్ధికి పాటుపడాలన్న తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్
మంగళవారం తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ వనపర్తి జిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డిఓసి సమావేశం మందిరంలో అల్పసంఖ్యాక వర్గాల శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని జిల్లాలోని పాస్టర్లు క్రిస్టియన్ మత పెద్దలతో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ రవితో కలిసి నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పథంలో పయనించాలని అదేవిధంగా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.