నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని దివ్యాంగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని, మంగళవారం దివ్యాంగుల హక్కుల పోరాట సంఘం అధ్యక్షుడు నాగన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు,పగిడ్యాల రోడ్ లోని సర్వేనెంబర్ 259 లో 450 మందికి 2004లో పట్టాలు మంజూరు చేశారని ఆయన తెలిపారు ప్రస్తుతం ఆ భూమి దేవాదాయ శాఖకు చెందిందని అధికారులు బోర్డు ఏర్పాటు చేయడంపై దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేశారు, తమకు న్యాయం చేయాలని దివ్యాంగులు కోరారు