దర్శి: నవంబర్ 12వ తేదీ ప్రభుత్వ మద్యం దుకాణానికి లాటరీ తీస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ సిఐ శ్రీనివాసులు వెల్లడి
Darsi, Prakasam | Nov 11, 2025 ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ప్రభుత్వ మద్యం దుకాణానికి దరఖాస్తులను ఆహ్వానించినట్లు ఎక్సైజ్ శాఖ సిఐ శ్రీనివాసులు తెలిపారు. నవంబర్ 10వ తేదీ లోపు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నవంబర్ 12వ తేదీ ఎనిమిది గంటలకు ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజబాబు సమక్షంలో లాటరీ తీస్తున్నట్లు తెలియజేశారు. సంబంధిత దరఖాస్తుదారులు తప్పనిసరిగా హాజరుకావాలని తెలియజేశారు.