రేషన్ డీలర్లకు కొత్త ఈ పాస్ మిషన్లు పంపిణీ చేసిన తహసిల్దార్ కార్యాలయం
కోడూరు నియోజవర్గంలోని మూడు మండలాల రేషన్ డీలర్ కు సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో కొత్త ఈపాస్ మిషను పంపిణీ చేశారు. కోడూరు 41, ఓబులు వారి పల్లి 28, చిట్వేల్ 31 మిషన్లను పంపిణీ చేసినట్టు సి ఎస్ టి శ్రీనివాసులు తెలిపారు. అలాగే ఈనెల చివరిలోపు కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు.