భువనగిరి: తాజ్ పూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూములు ప్రారంభం
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్ఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ క్లాస్ రూమ్ లోని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్కే ఫౌండేషన్ అధినేత డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ గవర్నమెంట్ పాఠశాల అయినప్పటికీ ప్రైవేటు పాఠశాలకు దీటుగా స్మార్ట్ టీవీలతో డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఓ కే సత్యనారాయణ ,జడ్పీ సీఈవో శోభారాణి, ఎంఈఓ పి నాగ వర్ధన్ రెడ్డి ,ఎంపీడీవో సిహెచ్ శ్రీనివాస్, ఎంపీ ఓ దినకర్ తదితరులు పాల్గొన్నారు.