కుప్పం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి: ఆర్డీవో
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని కుప్పం ఆర్డీవో శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఆర్డీవో కార్యాలయంలో గురువారం కుప్పం నియోజకవర్గ విజిలెన్స్, మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటిని అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.