గంటకు పైగా ఆగిన ఇంటర్సిటీ విక్రమ సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు
Ongole Urban, Prakasam | Sep 26, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర సమీపంలోని సూరారెడ్డిపాలెం వద్ద శుక్రవారం ఇంటర్సిటీ విక్రమ సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు గంటకు పైగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికులు రైల్వే సిబ్బందిపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గంటకు పైగా రైలు ఆపడానికి గల కారణం ఏంటంటూ రైల్వే సిబ్బందిని నిలదీశారు. రైల్వే ట్రాక్ నిర్మాణ పనులలో జరుగుతున్నాయని ట్రాక్ను సరిచేసే క్రమంలో ట్రైన్ను ఆపినట్లుగా రైల్వే సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు. ప్రయాణికులకు నచ్చచెప్పి ప్రయత్నం చేశారు.