దేవీపట్నం రైతుల పంట పొలాలకు సాగునీటి సరఫరాకు ఆటంకంగా ఉన్న వంతెన, తూముల్లో చెత్తా,చెదారాలు తొలగించాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ముసిరిమిల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీటి సరఫరా జరుగుతుంది. కాలువపై కొన్ని చోట్ల ఉన్న వంతెనల కారణంగా నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు దీనికి సంబంధించిన వివరాలు రైతులు తెలిపారు. ముసలిమిల్లి ప్రాజెక్టు ద్వారా చిన్నబియ్యంపల్లి గ్రామం మీదుగా దేవీపట్నానికి సాగునీటి సరఫరా జరుగుతుందని, మధ్యలో ఉన్న వంతెనల వల్ల నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇక్కడ తూముల్లో చెత్తాచెదారాలు పెరిగిపోయి నీటి సరఫరా జరగడం లేదని చెప్పారు. దీనిపై ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.