ఇబ్రహీంపట్నం: మంగళపల్లి గ్రామంలోని అన్ని బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ యజమానులతో సమావేశం నిర్వహించిన ఇబ్రహీంపట్నం ఏసిపి
ఇబ్రహీంపట్నం ఏసిపి కెవిపి రాజు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళపల్లి గ్రామంలోని అన్ని బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ యొక్క యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని అందులో ఉన్న ప్రతి స్టూడెంట్ యొక్క పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని సెక్యూరిటీని పెట్టాలని గర్ల్స్ హాస్టల్లో ఉమెన్ స్టాఫ్ ని పెట్టాలని విస్టెర్ రిజిస్టర్ మైంటైన్ చేయాలని మరియు సైబర్ క్రైమ్ గురించి వివరించారు.