మేడ్చల్: నాచారంలో జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
నాచారం మున్సిపాలిటీ, హెచ్ఎంటి నగర్ లోని హెచ్ఎండిఏ పార్కులో హెచ్ఎంటి నగర్ ఫ్రెండ్స్ టీం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 7:45 నిమిషాలకు జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ప్రముఖ సినీ నటుడు సుమన్, మాజీ ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.