పీలేరులో "నాన్న డైరీ" చిత్ర యూనిట్ సందడి
పీలేరులో "నాన్న డైరీ" చిత్ర యూనిట్ సోమవారం సందడి చేసింది. పీలేరు మండలంలోని అగ్రహారం శ్రీఅష్టలక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజా కార్యక్రమంతో పాటు చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ''ఆల్ ది బెస్ట్'' ఖాదర్ డైలాగ్ కు నిర్మాత కోటి పాలకుంట క్లాప్ ఇచ్చి సినిమా చిత్రీకరణ ఆరంభించారు.నిర్మాత మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబ జీవితం నేపథ్యంతో తండ్రీ కొడుకుల ఎమోషనల్ సెంటిమెంట్ కథాంశంతో "నాన్న డైరీ" టైటిల్ కు ప్రతి పేజీ వెనక ఓ కన్నీటిగాథ సబ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో మూడు రోజులు పీలేరు పరిసర ప్రాంతాల్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఉంటుందన్నారు