గుడూరు : ఇంటిపై పిడుగు పడటంతో సామగ్రి దగ్ధం
చిల్లకూరు మండలంలోని రాజేశ్వరమ్మ ఇల్లు సోమవారం పిడుగుపాటుకు గురై ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్థులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. బాధిత కుటుంబానికి తక్షణసాయం అందించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.