కుప్పం: కడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం,వ్యక్తికి తీవ్రగాయాలు
కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం కడపల్లి వద్ద సోమవారం బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. రాళ్ల బూదుగూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.