ఊయ్యురులో మాజీ మంత్రిపై జనసేన నాయకులు ఆగ్రహం
Machilipatnam South, Krishna | Sep 15, 2025
ఉయ్యూరు లో మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన నాయకుడు, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊయ్యురులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ విషయాన్ని రాద్ధాంతం చేయడం హేయమైన చర్య అని అన్నారు. కుల రాజకీయాలు పేర్ని నానికి వెన్నతో పెట్టిన విద్య అని, గిరి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని గణేష్ పేర్కొన్నారు.