ఎచ్చెర్ల: కోటబొమ్మాలి సమీప జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని ఢీకొట్టిన మరో లారీ, ధ్వంసమైన లారీ క్యాబిన్
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి సమీప జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 11:30 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న లారీను అధికమించే క్రమంలో వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాగ, లారీ వరద కాలువలోకి దూసుకుపోయి కరెంటు స్తంభాన్ని ఢీకొంది. కరెంటు వైర్లు లారీపై పడినప్పటికీ ఎటువంటి షార్ట్ సర్క్యూట్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.