ప్రకాశం జిల్లా కొండపి మండలం ముప్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం చేతుల పరిశుభ్రతపై ఎంపిడిఓ రామాంజనేయులు విద్యార్థులకు వివరించి చెప్పారు. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీడీవో రామాంజనేయులు పాఠశాలలు సందర్శించారు. విద్యార్థులు 60 రోజులపాటు తమ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు బంధువులకు అవగాహన కల్పించాలన్నారు. నిరంతర పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల నాలుగు ప్రయోజనాలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని విద్యార్థులకు ఎంపీడీవో సూచించారు.