అనధికారిక లేఔట్లను క్రమబద్ధీకరించుకోండి ;బనగానపల్లె గ్రామపంచాయతీ ఈవో సతీష్ కుమార్ రెడ్డి
అనధికార ప్లాట్ల యజమానులు తమ లేఅవుట్లను క్రమ బద్దీకరించుకోవాలని బనగానపల్లె డిప్యూటీ ఎంపీడీవో మరియు గ్రామపంచాయతీ ఈవో బొమ్మిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి సూచించారు.ఈ సందర్బంగా బనగానపల్లె పట్టణం లోని గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఈఓ సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అనధికార లేఔట్ల క్రమబద్ధీక రణ 2020ని కొన్ని మార్పులతో కొనసాగింపుగా 2025ను తీసుకువచ్చిందని తెలిపారు.అనధికార ప్లాట్ల యజమానులు పథకం -లేఔట్ రెగ్యులేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఎల్ ఆర్ ఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శు లకు సూచించారు