విద్యాసంస్థల యాజమాన్యాలు తమ డ్రైవర్లపై శ్రద్ధ అవసరం: ఆర్టీవో
తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ మరియు పోలీస్ శాఖల సమన్వయంతో స్కూల్లు మరియు కాలేజీల యాజమాన్యం ప్రతినిధులతో ప్రత్యేక రహదారి భద్రత సమీక్ష సమావేశం నిర్వహించారు రహదారి ప్రమాదాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆర్టీవో మురళి మాట్లాడుతూ విద్యాసంస్థల యాజమాన్యం తమ డ్రైవర్ల పై నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని అలాగే రహదారి భద్రత నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు.