గజపతినగరం: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: గంట్యాడ లో మండల వ్యవసాయాధికారి శ్యాం కుమార్
గంట్యాడ మండల పరిధిలో ఉన్న రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని, మంగళవారం సాయంత్రం గంట్యాడలో మండల వ్యవసాయాధికారి బి శ్యామ్ కుమార్ సూచించారు. గంట్యాడ మండలానికి ఖరీఫ్ సీజన్ కి సంబంధించి 1300 టన్నుల యూరియా వరి అరటి తోటలకు సరిపోతుందని, ఏం ఇప్పటివరకు రైతు సేవా కేంద్రాల ద్వారా 380 టన్నులు ప్రైవేటు డీలర్ల ద్వారా 331 టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని చెప్పారు.