తాడికొండ: తాడికొండలో టీడీపీ MP, MLA అభ్యర్థులకు బీఫామ్లు అందించిన చంద్రబాబు..
టీడీపీ MP, MLA అభ్యర్థులకు బీఫామ్లు అందించిన చంద్రబాబు గుంటూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు ఆదివారం బీ-ఫామ్లను అందచేశారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్, గుంటూరు తూర్పు-మొహమ్మద్ నజీర్, గుంటూరు పశ్చిమ-గళ్లా మాధవి, ప్రత్తిపాడు-బూర్ల రామాంజనేయులు, పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర, తాడికొండ-తెనాలి శ్రావణ్ కుమార్లు బీ ఫామ్లను అందుకున్నారు.