జీఎస్టీ శాతం తగ్గింపుతో వెహికల్ సేల్స్ పెరిగాయని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బీవీ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం పులివెందుల పట్టణంలో ట్రాన్స్ పోర్ట్ శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌పై బైకుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు బైకుల ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ ర్యాలీకి పోలీసు, జీఎస్టీ శాఖల సహకారం మరువలేనిదన్నారు.