పిచ్చాటూరు మండలంలో పామాయిల్ సాగు పై రైతులుకు అవగాహన సదస్సు
పిచ్చాటూరు: 'పామాయిల్ సాగుతో భవిష్యత్తు బాగు' పిచ్చాటూరు మండలంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహిచారు. ఈ ప్రాంతంలో రైతులు ఈ పంటను బాగుగా సాగు చేస్తున్నారని ఆ కంపెనీ అధినేత సీఈవో ఆశిష్ గోయాంక కొనియాడారు. ఇలాగే సాగు విస్తీర్ణం పెరిగితే భవిష్యత్తులో పక్కా ప్రణాళికలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు కంపెనీ సీఈవో ఆశిష్ గోయంక, సంస్థ హెడ్ కిలారీ శ్రీనివాస్, జీయమ్ విజయప్రసాద్, జోనల్ హెడ్ వెంకట మురళీ హాజరయ్యారు.