తాడిపత్రి పట్టణంలోని నందలపాడు ఏరియాలో ఓ పేకాట స్థావరంపై ఎస్సై గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్కడ పేకాట ఆడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17,840 నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఐదు సెల్ ఫోన్ లను సీజ్ చేశారు. ఈ సంఘటనపై ఎస్ఐ గౌస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.