శామీర్పేట: ఫిర్జాదిగూడ చెరువుపై రోడ్డు పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని 5వ డివిజన్ పర్వతాపురం పోచమ్మ కుంట చెరువు పై జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం పిఎంసి కాంగ్రెస్ అధ్యక్షులు తుంగతుర్తి రవి పరిశీలించారు .ఈ సందర్భంగా ఆయన మనలో పురోగతిని పర్యవేక్షించి నాణ్యత ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు .ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశ గోని శ్రీనివాస్ గౌడ్ మాజీ ఉపసర్పంచ్ మునుకుంట్ల సహదేవ్ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ బద్దం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.