జనగాం: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా జనగామ పట్టణంలోని స్థానిక గాయత్రి గార్డెన్స్ లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారి స్ఫూర్తితో పెద్ద ఎత్తున యువత కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని అన్నారు.