గద్వాల్: జిల్లాలో కార్మికులకు వేతనాలు విడుదల చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం సీపీఎం నాయకులు.
ప్రభుత్వ పాఠశాలలలో పనిచేసే స్కావెంజర్లకు వేతనాలను విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఉప్పేరు నరసింహ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ఐదు నెలల నుంచి కార్మికులకు వేతనాలు అందడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని వేతనాలను విడుదల చేయాలన్నారు.