రాజపేట: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కుర్రారం గ్రామంలో అలుగు నిర్మాణం చేపట్టి చెరువులో నీళ్లు నింపాలని రైతులు డిమాండ్
యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలం, కుర్రారం గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య రానున్న నేపథ్యంలో గ్రామ రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న టెంట్ ను అధికారులు తొలగించి ఆ స్థానంలో మరొకటింటూ ఏర్పాటు చేయడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం గ్రామ రైతులు మాట్లాడుతూ.. ప్రజాపాలన అని చెప్పుకుంటూ పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలో అలుగు నిర్మాణం చేపట్టి చెరువు నింపాలని కోరారు.