ఆల్విన్కాలనీ డివిజన్ ఎల్లమ్మబండలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం మత్తు పదార్థాల నియంత్రణపై యువ చైతన్య యాత్ర నిర్వహించారు. జగద్గిరిగుట్ట సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు పాల్గొన్నారు. డ్రగ్ రహిత ఎల్లమ్మబండగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. గంజాయి మహమ్మారి వల్ల నిర్వీర్యం అవుతున్న యువత జీవితాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.