అవనిగడ్డ: అన్నదాతకు అండగా వైయస్ఆర్సీపీ ఉంటుంది: మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
అవనిగడ్డలోని వైసీపీ కార్యాలయంలో కూటమి సర్కార్ పై నిరసన గళం పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. రైతు సమస్యలు పరిష్కరించాలని ఈనెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రైతులతో ర్యాలీ, వినతిపత్రం అందజేస్తామన్నారు.