కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి KCRకు సంబంధంలేదని కవిత చెప్పడం హాస్యాస్పదం : ప్రజా మిత్రమండలి అధ్యక్షుడు కొరివి
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి మాజీ సీఎం కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు అని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యనించడం హాస్యస్పదంగా ఉందన్నారు ప్రజా మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. గురువారం మధ్యాహ్నం 3గంటలకు కరీంనగర్‌లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొరివి వేణుగోపాల్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే అవినీతి జరిగిందన్నారు. కేటీఆర్, హరీష్‌రావు, సంతోష్‌రావు, కవిత..కేసీఆర్‌కు నీడలా ఉంటూ అవినీతిలో పాలుపంచుకున్నారన్నారు. కేసీఆర్ నీతి, నిజాయితీల గురించి కవిత కొత్తగా చెప్పనవసరంలేదన్నారు.