కళ్యాణదుర్గం: పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కళ్యాణదుర్గంలో వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమామహేశ్వర నాయుడు
పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమామహేశ్వర నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో బుధవారం కుందుర్పి సర్పంచ్ రామ్మూర్తి, మాజీ జెడ్పిటిసి రాజగోపాల్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఉమామహేశ్వర నాయుడు ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. 2029 లో వైసీపీ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. జగన్ రెండోసారి సీఎం కాబోతున్నాడు అన్నారు.