సోమందేపల్లిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం దంచి కొట్టింది. సోమందేపల్లిలో వారపు సంత జరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..