ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గుట్లపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. జనవరి ఒకటో తేదీ సెలవు కాబట్టి ముందుగానే డిసెంబర్ 31వ తేదీన లబ్ధిదారులకు అందజేశామన్నారు.