మార్కాపురం: పాత బస్టాండు సెంటర్లో ఉచిత ఇసుక ఇవ్వాలంటూ సిపిఎం నాయకులు ధర్నా
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో సిపిఎం నాయకులు భవన నిర్మాణ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఉచిత ఇసుక హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు లారీ యజమానులను బెదిరిస్తున్నారని అన్నారు. టన్ను ఎనిమిది వందల రూపాయల కొనుగోలు చేసి 1400 రూపాయలు అమ్ముతూ ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు. ఉచిత ఇసుక హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని అన్నారు.