పీలేరు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పీలేరు మండలం రేగళ్లు గ్రామం బోయపల్లి నందు వైకాపా నాయకుడు దాసరి యర్రయ్య దశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.పీలేరు మండలం రేగళ్లు గ్రామం బోయపల్లి నందు రేగళ్లు గ్రామం వైకాపా నాయకులు మరియు కార్యకర్తలను కలుసుకున్నారు.పీలేరు పట్టణం సరోజినీ నాయుడు కాలనీ నందు వైకాపా పార్టీ వార్డు సభ్యుడు మల్లెల శ్రీనివాసులు రెడ్డి అత్త కళావతమ్మ (65) మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు