డిజిటల్ అరెస్ట్ పేరిట అమాయక ప్రజలకు వలవేసే సైబర్ నేరగాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇటీవల సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలకు వలవేస్తూ డిజిటల్ అరెస్ట్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని ఇటువంటి వాటికి ప్రజలు నమ్మి మోసపోవద్దని అన్నారు. మీ బంధువులు ఏదో ఒక కేసులో చిక్కుకున్నారని డబ్బులు ఇస్తే విడిచిపెడతామని చెబుతుంటారని ఇటువంటి వాటికి స్పందించకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.