కర్నూలు: కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తి తెలియని వ్యక్తి మృతి చెందినట్లు కర్నూలు ఫోర్త్ టౌన్ సీఐ విక్రమ్ సింహ తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో అనారోగ్యంతో చనిపోయి ఉండగా అతనిని కర్నూలు నాలుగవ పట్టణ పోలీసులు గుర్తించి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కి తరలించారు. మృతుడి వివరాలు పోలీసులు విచారించగా పేపర్లు సేకరిస్తూ భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడని అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఈ మృతిపై పట్ల కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.