గూడూరు నియోజకవర్గంలోని భూసమస్యలను పరిష్కరించండి : MLA సునిల్ కుమార్
గూడూరు నియోజకవర్గంలోని భూ సమస్యలను పరిష్కరించాలని MLA సునీల్ కుమార్ శుక్రవారం కలెక్టర్ను కోరారు. ముఖ్యంగా కోట(M) వెంకన్నపాలెం గ్రామ గర్భకండ్రిగ భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.