ఒంటిమిట్ట: శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి ఆమోదం: టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ నూతన అభివృద్ధి పనులకు టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు ఆమోదం తెలిపారు మంగళవారం తిరుమలలో బోర్డ్ మీటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కళ్యాణ వేదిక వద్ద జాతీయ రహదారి పక్కనే రూ 37 కోట్లతో భక్తులకు100 గదుల భవనాన్ని ఆలయ సమీపంలో2.9 కోట్లతో భక్తులకు ఆహ్వాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా పవిత్ర వనాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు అన్నారు.