అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి
Anantapur Urban, Anantapur | Oct 19, 2025
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రాంగణంలో గుర్తు తెలియని వృద్ధుడు ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు రైనా కుమారి వెల్లడించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రాంగణంలో చికిత్స కోసం వచ్చిన వృద్ధుడు స్థానిక సందర్శకుల వసతి కేంద్రంలో అపస్మానిక స్థితిలో పడి ఉన్న విషయాన్ని గుర్తించి వైద్యులకు సమాచారాన్ని అందించారు. దీంతో పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.