స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థిక అక్షరాస్యత సాధించాలి: డి ఆర్ డి ఎ పి డి శ్రీదేవి
Chittoor Urban, Chittoor | Sep 15, 2025
స్వయం సహాయక సంఘాల్లో సభ్యులందరూ ఆర్థిక అక్షరాస్యత సాధించే దిశగా ఫైనాన్షియల్ లిట్రసి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు కృషి చేయాలని చిత్తూరు డిఆర్డిఏ పిడి శ్రీదేవి తెలిపారు సోమవారం డిఆర్డిఏ సమావేశ మందిరంలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన ఆర్థిక అంశాలపై ఎఫ్ ఎల్ సి ఆర్ సి లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ నేటి టెక్నాలజీ యుగంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా ఆర్థిక కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పారు ముఖ్యంగా టెక్నాలజీని అందిపుచ్చుకొని తమ ఆర్థిక కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉందన్నారు.