కోడుమూరు: శివరాంపురంలో ఎమ్మెల్యే, పెంచికలపాడులో వ్యవసాయాధికారులు రైతన్నా మీకోసం నిర్వహణ
కోడుమూరు నియోజకవర్గంలోని శివరాంపురం, పెంచికలపాడు గ్రామాల్లో మంగళవారం రైతన్నా మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శివరాంపురంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులకు వివరించారు. పెంచికలపాడు గ్రామంలో వ్యవసాయ అధికారులు, టిడిపి నాయకులు రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ నవశకంలో రైతుల అభ్యున్నతికి పంచ సూత్రాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.